Advertisement

Responsive Advertisement

Datta Chalisa - Telugu | దత్త చాలీసా


శ్రీ దత్త చాలీసా :

Datta Chalisa in telugu,Datta Chalisa,శ్రీ దత్త చాలీసా,Datta Chalisa lyrics in telugu, datta charitra in telugu,datha chalisa in telugu pdf


వల్లభాపుర వాస దత్తప్రభో

భక్తుల కాచే భగవంతా

జగద్గురుడవు నీవయ్య

జగతికి మూలము నీవేనయ్య


అత్రి మహాముని సంకల్పం

అనసూయాదేవి తపోబలం

అవనిపైన నీ ఆగమనం

దివ్యమైన నీ విచిత్ర రూపం


మునులు దేవతలందరును

నీ రూపమును దర్శించి

అమితమైన ఆనందమును

పొంది, ముక్తులు అయ్యిరయా


ప్రణవ స్వరూప ఓ దేవ

వేదములను ప్రబోధించి

జ్ఞానులకే సుజ్ఞానమును

ఒసగి వారల బ్రోచితివి


సాధకుడైన సాంకృతికి

అష్టాంగ యోగము బోధించి

యోగుల పాలిటి దైవమువై

యోగిరాజువై నిలచితివీ


బ్రహ్మదేవుని తలపునను

అక్షర పరబ్రహ్మ యోగమును

తెలిపి పునః సృష్టి కారణమైన

పరబ్రహ్మవు నీవేనయా


మంగళరూపం ధరించి

శృంగారముగ భావించి

అంగనలతో నీవుంటివని

భంగ పడెనయ్యా దేవేంద్రుడు


నీ నిజరూపం తెలియగను

నీ మహిమలను స్మరియింప

నీకృప వారిపై వర్షించి

నిజతత్త్వమును తెలిపితివి



జంభాసురుని తాకిడికి

తాళగలేక పోతినని

దేవేంద్రుడు నిను ప్రార్ధింప

అసురుని ద్రుంచిన అనఘాప్రియా


స్మరృగామి యని తెలుసుకొని

దలాదనుడు నిను స్మరియింప

ప్రత్యక్షంబై నిలచితివి

వజ్రకవచము బోధించితివీ


కార్తవీర్యుని రక్షించి

సహస్రబాహుల బలమొసగి

అష్టసిద్దుల నిచ్చితివి

అమిత పరాక్రనుము జేసితివీ


అశాంతి నొందిన రేణుక పుత్రుడు

శాంతికోసమై అలమటించగా

సంవర్తనావధూత రూపమున

శాంతి నొసగి బ్రోచితివి


శ్రద్దాభక్తితో భార్గవరాముడు

నిన్నుదరిచేరి సేవించగా

త్రిపురా రహస్యం ప్రబోధించిన


త్రిశక్తి రూపుడు నీవేనయ్యా


మదాలసా మాత సంకల్పం

అలర్భుడు నిను చేరగనే

యోగ విద్యను తెలిపితివి

యోగీశ్వరునిగ జేసెతివి


బ్రహ్మరాక్షసుని సాయమున

విష్ణుదత్తుడు నిను చేరగనే

ముప్పతిప్పలు పెట్టితివి

మురిపెముతో దరిచేర్చితివీ


విష్ణుదళ్తుడు కోరగనే

పితృకార్యమున కొచ్చితివి

సుశీలమ్మ - పిలువగనే

అనలుగు - సూర్యుడు వచ్చిరయా


కోరిక లేమియు లేనట్టి

ఆ దంపతులను దీవించి

అద్భుతమైన మంత్రము నొసగి

జనహితకారిని చేసితివి


కాశీలో నీ స్నానమట

కొల్దాపురిలో భిక్షమట

చంద్రభాగలో చేతిని కడిగి

తుంగభద్రలో నీటిని త్రాగి


సహ్యాద్రిపురమున వాసమట

మహురుగడలో నిద్రయట

చిత్రమయా నీ సంచారం

యోగీశ్వరేశ్వర చక్రవర్తీ


కలియుగ మందున శ్రీపాదుడవై

గురుభక్తులను బ్రోచితివీ

నరసింహ సరస్వతీ స్వామిగ నీవు

గురుభక్తిని ఇల చాటితివి


మాణిక్య ప్రభువుగ లీలలు చూపి

స్వామి సమర్ధగా భక్తుల గాచీ

సాయినాధుడై బరిడీలో వెలసి

అశ్రితులను గాపాడితివి


నిరతము నిన్ను స్మరియించే

విఠలుడు పలికిన పలుకులివి

పలికిన వారిని పరిరక్షించు

వల్లభాపురవాస గురుదత్తా


శ్రీ గురుచరితము చదవండీ

సద్గురు శక్తిని తలియండీ

భక్తితో మీరు కొలవండీ

దత్త దేవ కృప పొందండీ


మంగళమయ్య గురుదేవా

సచ్చిదానంద సద్దురుదేవా

మంగళకరుడవు నీవయ్యా

భక్తుల బ్రోవుము గురుదత్తా


శ్రీ సచ్చిదానంద సద్గురు దత్తాత్రేయ మహరాజ్‌కీ జై 

ఓం శాంతిః శాంతిః శాంతిః


Post a Comment

1 Comments